BREAKING : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై పోలీస్ కేసు..మైనర్ బాలిక ఫోటోలు రిలీజ్ చేశాడని !

-

హైదరాబాద్ : దుబ్బాక బిజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు పై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. మైనర్ బాలిక ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడంపై ఫిర్యాదు చేయడంతో పోలీస్ కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసు నమోదు చేసారు అబిడ్స్ పోలీసులు. Ipc section 228A కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నారు అబిడ్స్ పోలీసులు.

ఇది ఇలా ఉండగా శంషాబాద్ లో NSUI నేత బల్మూరి వెంకట్ పై కేసు నమోదు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రాత్రీపగలు మందుబాబులకు అడ్డాగా మారిందంటూ ఆదివారం తెల్లవారుజామున బార్లలో హల్ చల్ చేశాడు NSUI నేత బల్మూరి వెంకట్ . ప్రభుత్వ అనుమతులు ఉన్న బార్లను మూసివేయాలంటూ నిర్వాహకులను బెదిరించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసినట్లు కేసు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version