ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితుల కస్టడీకి ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్

-

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో మొయినాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ముగ్గురు నిందితులను కస్టడీకి అనుమతి ఇచ్చింది.

రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలని.. ఆ తర్వాత తిరిగి చంచల్​గూడ జైలుకు పంపించాలని కోర్టు షరతు విధించింది. పోలీసులు చంచల్‌గూడలో జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి స్వామీజీలను కస్టడీలోకి తీసుకొనున్నారు. ముగ్గురు నిందితులను ప్రశ్నించడం ద్వారా కేసులో పురోగతి సాధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కానీ కోర్టు నిందితులను రెండు రోజులపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version