తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం అయింది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 35, 655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేశారు అధికారులు. అయితే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా…. 13 నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటల సమయానికి పోలింగ్ ముగియనుంది.
సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాల పల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్త గూడెం, అశ్వ రావు పేట, భద్రాచలం నియోజకవర్గం ఈ జాబితాలో ఉన్నాయి. పోలింగ్ మూసే సమయానికి క్యూలో ఉన్న వా రు మాత్రమే ఓటు వేయవచ్చును. నాలుగు గంటలు దాటిందంటే ఎవరిని కూడా ఓటు వేసేందుకు అనుమతించరు. అటు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న విద్యాశాఖ సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఒక టో తేదీన సెలవు ప్రకటించింది.