తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 2.80 లక్షల మంది

-

తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. పోలింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోలింగ్ రోజున ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన వసతులు కల్పించే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో 2.80 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించుకునేందుకు నమోదు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

వారిలో 80 శాతం మంది సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారని వెల్లడించారు.. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు మూడు రోజులు అవకాశం కల్పిస్తామని… ప్రస్తుతానికి వచ్చే నెల 5, 6, 7 తేదీలని అనుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల సంఘం అనుమతితో ఆ తేదీలను త్వరలో ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.

ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఫెసిలిటీ సెంటర్‌లో ఓటేయవచ్చని వికాస్ రాజ్ తెలిపారు. అందరూ ఒకే రోజు వెళితే ఇతర పనులకు ఇబ్బంది వస్తుందని… అందుకోసమే మూడు రోజుల వ్యవధి నిర్ణయించినట్లు చెప్పారు. వారు ఓటు వేసేందుకు ఎంచుకున్న రోజున ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని.. ఇంటి నుంచి ఓటు వేసేందుకు 24,974 మంది ఎంచుకున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version