కరెంట్ సమస్యలపై తెలంగాణ విద్యుత్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్ ని ప్రారంభించారు ఈ ఆర్సీ ఛైర్మెన్ శ్రీ రంగ రావు. ఈ సందర్భంగా ఈ ఆర్సీ ఛైర్మెన్ శ్రీ రంగ రావు మాట్లాడుతూ….వినియోగదారుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్ రూపొందించామని.. ఆన్లైన్ ద్వారా విద్యుత్ వినియోగదారులు కంప్లైట్ చేయొచ్చు అని పేర్కొన్నారు.
అధికారుల పని తీరుపైన కూడా ఇందులో సమాచారం ఇవ్వొచ్చు..కాంజ్యుమార్ గ్రీవెన్స్ సెల్ ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని పేర్కొన్నారు. ఏ సమస్యనైన పరిష్కారం ఈ గ్రీవెన్స్ సెల్ తీసుకుంటుంది… విద్యుత్ వినియోగదారులకు ఏ సమస్య వచ్చినా సమాచారం ఇవ్వొచ్చని ఆయన స్పష్టం చేశారు. గ్రీవెన్స్ సెల్ సమస్య పరిష్కారం చూపెట్టకపోతే అంబుడ్స్ మెన్ అథారిటికి ఫిర్యాదు చేయిచ్చు.. ఇలాంటి వాటి అన్నింటి కోసం యాప్ తీసుకొచ్చమని.. చెప్పారు. ఈ సదుపాయాన్ని వినియోగదారులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.