భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్..

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్ ఉండనుందని ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టికి ప్రజా భవన్‌ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Praja Bhavan as official residence of Bhatti Vikramarka

కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కొత్త క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు స్థలాలు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి క్యాంప్‌ ఆఫీస్‌ లేదు. ఆయన జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. అక్కడ క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version