గురుకుల కాలేజీలో బాత్ రూమ్ ల బండారం బయటపెట్టిన ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

-

గురుకుల కాలేజీలో బాత్ రూమ్ ల బండారం బయటపెట్టారు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. తెలంగాణలో ఒక గురుకుల జూనియర్ కాలేజీలో బాత్ రూమ్ ల పరిస్థితి యిది ! యిక్కడ ఏ ఒక్క లావేటరీ రూమ్ కు గానీ , బాత్ రూమ్ కు గానీ డోర్స్ లేవు ! వాటర్ ట్యాప్ లు సీల్ వేయబడి ఉన్నాయి… బయట వాటర్ ట్యాంక్ ఉంటుంది గానీ నీళ్ళు రావు ! వీళ్ళ ఉద్ధేశ్యం ఏమంటే స్టూడెంట్స్ ను బహిర్భూమికి బయటకు పంపడం అంటూ వీడియోను షేర్‌ చేశారు.

ఈ విధంగా డోర్లు లేకుండా చేస్తే , నీళ్ళు రాకుండా చేస్తే చచ్చినట్లు విద్యార్థులు చెట్లూ , పుట్టల చాటుకు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొంటరు పైన వాటర్ ట్యాంకులకు నీళ్ళు వదలరు ! బయట ఉండే ఒకే ఒక ట్యాంక్ దగ్గర 5వతరగతి నుండి 10వ తరగతి విద్యార్థులూ + ఇంటర్ మీడియట్ విద్యార్థులూ అందరూ సామూహిక స్నానాల కోసం ఎగబడుతరు ! ఆ ట్యాంక్ కు కూడ నీళ్ళు ఎక్కువసేపు వదలరన్నారు.

ఇక మెస్ లో భోజన సదుపాయాలు మరీ ఘోరం రెండు పూటలా ఒకటే కర్రీ , ఒకటే సాంబార్ లు ఒడ్డించిన సందర్భాలు కూడా ఉన్నాయంట ! ప్రిన్సిపాల్ ను తల్లిదండ్రులు కలవడానికి అవకాశమే లేదు స్కూల్ కు , హాస్టల్ కు ఉండే డోర్ల దగ్గర ద్వారపాలకులు విద్యార్థుల తల్లిదండ్రులను ఆపేస్తరు ! లోపలికి అనుమతించరని నిప్పులు చెరిగారు. ఇంకా ఇంటర్నీడియట్ కాలేజికి లెక్చరర్ల నియామకమే జరగలేదంట.. కాలేజి లు మొదలయి దాదాపుగా నెలరోజులయిందని పోస్ట్‌ పెట్టారు ఆర్‌ఎస్పీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version