మే మొదటి వారంలో తెలంగాణకు ప్రియాంకా గాంధీ

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్సభ పోరులోనూ రిపీట్ చేయాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ పార్టీ పీసీసీ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు, స్థానిక నేతలతో సమావేశం అవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం రోజున భువనగిరి నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో అదే రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

మరోవైపు మే మొదటి వారంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ, చౌట్‌ప్పల్‌ రెండు చోట్ల నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ భారీ బహిరంగ సభల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 14 స్థానాల్లో గెలుస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. భువనగిరిలో మెజార్టీ 2 లక్షలకు తక్కువ కాకుండా చామల కిరణ్‌కుమార్ రెడ్డిని గెలిపించేలా చూడాలని కార్యకర్తలకు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version