కొండాపూర్‌లో హైటెక్‌ వ్యభిచారం..ఆన్‌లైన్‌లో ఫారిన్ గర్ల్స్ బుకింగ్

-

హైదరాబాద్లో ఆన్‌లైన్‌ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్‌ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. కొండాపూర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పక్కా ప్లాన్తో దాడులు చేపట్టిన అధికారులకు వ్యభిచారం నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు.

ఈ నేపథ్యంలో 17 మంది విదేశీ యువతులను అదుపులోకి తీసుకుని పోలీసులు సేఫ్‌ హౌస్‌కు తరలించారు. నిర్వాహకుడు శివకుమార్‌తో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. ఓ వెబ్‌సైట్‌ ద్వారా ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు మాదాపూర్ ఏసీపీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి నాలుగు సెల్‌ ఫోన్లు, 25 హెచ్‌ఐవీ పరీక్ష కిట్లు, హుక్కా పాట్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఉగాండాకు చెందిన 14 మంది యువతులు, ఒకరు టాంజానియానకు చెందిన వారు, ఇద్దరు ముంబయి, బెంగళూరు నగరాలకు చెందిన యువతులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version