హైదరాబాద్‌ లో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం

-

హైదరాబాద్ నగరంలో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చందానగర్‌లో స్పా సెంటర్‌పై దాడులు చేసి నలుగురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీసులు దాడి చేసి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరో ఘటనలో కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని సెలూన్‌ షాప్‌పై పోలీసులు దాడులు చేసి సెలూన్‌, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని బార్‌లు, పబ్‌లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు హైదరాబాద్‌లో 12, రంగారెడ్డిలో 13 బార్లు, పబ్బులపై శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించి స్పాట్ డ్రగ్స్ టెస్టు చేశారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు 25 ప్రముఖ బార్‌లు, పబ్బులపై 25 ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించారు. డ్రగ్స్‌ వినియోగంపై 12 ప్యానెల్‌ డ్రగ్స్‌ డిటెక్షన్‌ కిట్స్‌తో పరీక్షలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version