నటి జెత్వానీ వేధింపుల కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాజగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు పీఎస్ఆర్ ఆంజనేయులు. గ్రూప్-1 అక్రమాల కేసు, నటి జెత్వానీ వేధింపుల కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పీఎస్ఆర్ ఆంజనేయులు. RRR కస్టోడియల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగనుంది.

ఇది ఇలా ఉండగా పీఎస్ఆర్ ఆంజనేయులుకు వచ్చేనెల 4 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. దింతో ఆంజనేయులును విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు. ముంబయి నటి కేసులో విజయవాడ కోర్టుకు పీఎస్ఆర్ ఆంజనేయులు ను తరలించారు. రిమాండ్ ముగియడంతో ఆంజనేయులును కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ తరుణంలోనే పీఎస్ఆర్ ఆంజనేయులుకు వచ్చేనెల 4 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు.