బౌన్సర్ల దుకాణం పెట్టిందే రేవంత్ రెడ్డి – ఎంపీ రఘునందన్ రావు

-

సంధ్య థియేటర్ దగ్గర తోక్కీసలాట ఘటనలో అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తున్న అంటోనిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రైవేట్ బౌన్సర్ల వ్యవస్థపై బిజెపి ఎంపి రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

అసలు రాష్ట్రంలో ఈ బౌన్సర్ల దుకాణం పెట్టిందే రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. బుధవారం మెదక్ లో ఆయన మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఊరంతా కోపగించుకుంటారని.. అందరికీ శత్రువులు అవుతారంటూ పెద్దలు చెప్పారని కామెంట్స్ చేశారు.

ప్రైవేట్ బౌన్సర్లను తీసుకువచ్చి జనాన్ని పక్కకు నెట్టించే సాంస్కృతి రాష్ట్రానికి తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి అని.. ఆయన పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు చుట్టూ బౌన్సర్లని పెట్టుకుని జనాలను పక్కకు నెట్టే కార్యక్రమం మొదలు పెట్టారని ఆరోపించారు. అల్లు అర్జున్ పంచాయితీలో బౌన్సర్లను ఎందుకు తీసుకువస్తున్నారు..? అని ప్రశ్నించారు రఘునందన్ రావు. సిపి సి.వి ఆనంద్ కి చిత్తశుద్ధి ఉంటే బౌన్సర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version