రాహుల్ గాంధీ ఇంటిముందు ధర్నా చేస్తా అంటే ఊరుకుంటామా..? : జగ్గారెడ్డి

-

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయనే చెప్పాలి. ఇవాళ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీష్ రావు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటున్నాడు. ఆనాడు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కేసీఆర్ కుటుంబం. ఒక్క హామీ కూడా అమలు చేయలేదని.. అలాంటి నువ్వు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే ఊరుకుంటామా అని మండిపడ్డారు.

అదేవిధంగా తెలంగాణ ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి నువ్వు నీ మామ ప్రజలను మోసం చేశారని తెలిపారు. ప్రజలను మోసం చేసినందుకు కేసిఆర్ ఫాం హౌస్ దగ్గర దీక్ష చేస్తానని హరీష్ రావు ఢిల్లీ పోయిన రోజే తాను కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావు, కేటీఆర్ కి సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version