నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు నన్ను వదిలేయండి – రాహుల్ సిప్లిగంజ్

-

ప్రముఖ తెలుగు పాప్ సింగర్ బిగ్ బాస్ టైటిల్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కి ప్రస్తుతం బయట మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 3 కి విన్నర్ కావడంతో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు రాహుల్. అంతేకాకుండా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఛాన్స్ కూడా దక్కించుకున్నాడు.

బిగ్ బాస్ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ సింగర్ కి పబ్ కల్చర్ ఉండటం వల్ల అనవసర గొడవలు తన మీదికి తెచ్చుకున్నాడు. ఐతే తాజాగా తన రాజకీయాల రంగ ప్రవేశం పై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ ఇచ్చారు. నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు నన్ను వదిలేయండన్నారు రాహుల్ సిప్లిగంజ్. అసెంబ్లీ ఎన్నికల్లో గోషా మహల్ సీట్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నట్లు వచ్చిన పుకార్లను కొట్టిపారేసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్…తాను రాజకీయాల్లో రాలేను అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version