హైదరాబాద్ లో కుండపోత… రోడ్లన్నీ జలమయం

-

హైదరాబాద్‌ మహా నగరంలో విపరీతంగా వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై నుంచి వర్షపు నీరు డ్రైనేజీతో పాటు ప్రవహిస్తుంది.

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వారాసిగూడా, మహమ్మద్ గూడ, చిలకలగూడా ప్రధాన నాల పొంగిపొర్లుతుంది, ఒలిఫెంటా బ్రడ్జ్ ప్రధాన రహదారి జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఏకధాటిగా వర్షం కురుస్తున్నందున ఇళ్లలోకి నీరు చేరుతుందేమో అన్న భయంలో లోతట్టు ప్రాంతాల వాసులు ఉన్నారు. జగత్ గిరి గుట్ట,ముసాపెట్ , కూకట్ పల్లి, జే ఎన్ టీ యు,హైదర్ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, నార్సింగీ, మణికొండ, గండిపేట, బండ్లగూడ లో వాన దంచి కొడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version