తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్….తెలంగాణాలో వారం రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణా రాష్ట్రంలో రాగల వారం రోజుల వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ఒకటి మధ్య మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడింది.
నిన్న మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగిన ద్రోణి / గాలి విచ్చిన్నతి ఈరోజు బలహీనపడింది. ఈ తరుణంలో వారం రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు మరియు రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 – 40 కి. మీ., ఎల్లుండి 40 – 50 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.