ఇవాళ పిఠాపురంలో ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్న జగన్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇవాళ ప్రచారం ముగియనుంది. ఈ తరుణంలో ఇక ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. మొట్టమొదటగా చిలకలూరిపేటలో ప్రచారం చేస్తారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

CM Jagan, Chandrababu, Pawan Kalyan to Prakasam district today

ఆ తర్వాత కైకలూరులో ప్రచారం చేసి నేరుగా పిఠాపురం వెళ్తారు. ఇవాళ సాయంత్రం పిఠాపురం నియోజకవర్గంలో ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గ కావడంతో… పిఠాపురంలో సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తుంది వైసిపి. దీంతో అందరి చూపు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం పైనే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version