కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆనందం సినిమా ఫేమ్ రాజా

-

ఆనంద్ సినిమా ఫేమ్ రాజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గిడుగు‌ రుద్రరాజు ఆధ్వర్యంలో ఆనంద్ సినిమా ఫేమ్ రాజా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా ఆనందం సినిమా ఫేమ్ రాజా మాట్లాడుతూ… నాకు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు సంతోషం ఉందన్నారు. కాంగ్రెస్ లాంటి సెక్యులర్ ఆలోచనలు ఉన్న పార్టీలో చేరానని తెలిపారు.

అన్ని వర్గాలకీ న్యాయం చేసే పార్టీగా కాంగ్రెస్ ఉందని.. జాతీయ స్ధాయిలో తెలుగువారికి లీడర్ గా ఉండే అవకాశం నాకు కాంగ్రెస్ వలన వచ్చిందన్నారు. మణిపూర్ అంశంలో చాలా మంది నోరు మెదపలేకపోయారని ఫైర్ అయ్యారు. రాజకీయ పదవులు ఇస్తారు.. ఆశీస్తే రావని చెప్పారు. అటు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గిడుగు‌ రుద్రరాజు మాట్లాడుతూ… మహిళా రిజర్వేషన్ పై రాజీవ్ గాంధీ ఆనాడే ఆలోచన చేసారని… మహిళా సాధికారతకు పి.వి.నరసింహారావు గారు చేసిన కృషి ఫలితమే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆనాడే మేం రాజ్యసభలో బిల్లు పెట్టామని… ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్తదేం కాదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version