హైదరాబాద్ లో ఎక్కడ చూసినా టూ లెట్ బోర్డ్ లు ఉన్నాయని చురకలు అంటించారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి పాలనా కారణంగా హైదరాబాద్ ఖాళీ అవుతోందని విమర్శలు చేశారు.
ఎవరన్నా అధికారంలో ఉంటే నిర్మాణం వెైపు అడుగులేస్తారు..సీఎం రేవంత్ రెడ్డి కూల్చివేతలు చేస్తున్నడు..అని ఆగ్రహించారు. వికాసం కోసం అడుగులెయ్యాలి.. కానీ హైడ్రతో విధ్వంసం సృష్టిస్తున్నాడు అని మండిపడ్డారు. నీ అవగాహన రాహిత్యం వల్ల, అనుభవ రాహిత్యం వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల, విచ్చల విడి అవినీతి వల్ల తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో మునిగి పోతుందన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు తొమ్మిది నెలలుగా జీతాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందన్నారు.