కేసీఆర్ సర్కార్ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేస్తోందని… తాజాగా కరీంనగర్ జిల్లాలో నాణ్యమైన ఫుడ్ కోసం… కాలేజీల్లో సౌకర్యాల కోసం స్టూడెంట్లు రోడ్డెక్కారని విజయశాంతి ఫైర్ అయ్యారు. కరీంనగర్ ఫార్మసీ కాలేజీలో వంట మనిషి లేక 15 రోజులుగా భోజనమే వండడం లేదు. స్పోర్ట్స్ స్కూలులో ఎండిపోయిన బ్రెడ్డు… చెడిపోయిన జామ్ అందించారన్నారు.
అధికారులకు తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏం కేసీఆర్… ఇదేనా నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ? రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఫుడ్ పాయిజన్ జరుగుతూనే ఉంది. అయినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకున్న పాపాన పోలేదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కేసీఆర్ సర్కార్కు తెలంగాణ విద్యార్థి లోకమే తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు విజయశాంతి.