ప్రధాని పోటీచేసినా చేవెళ్ల బరిలో నేనే ఉంటా : రంజిత్ రెడ్డి

-

ప్రధాని పోటీచేసినా చేవెళ్ల బరిలో నేనే ఉంటానని చేవేళ్ల బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను మళ్ళీ చేవెళ్ల ఎంపీగానే బరిలోకి దిగుతానని రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రధాని మోదీ స్వయంగా చేవెళ్ల నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ నుంచి నేనే బరిలో ఉంటా. రాబోయే ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు సమదూరంలో ఉంటాం.

ఇదే మా పార్టీ విధానం. మేము ఎవరికోసమో సిట్టింగ్ స్థానం త్యాగం చేయం. ఈ స్థానాన్ని బిజెపికి కేటాయిస్తారని రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలు అర్థరహితం’ అని తెలిపారు. కాగా, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సుడిగాడి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తమ వాడివేడి ప్రసంగాలతో ఓవైపు కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తూ.. మరోవైపు ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇద్దరు మంత్రులు ఇప్పటి వరకు 50 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వాడివేడి ప్రసంగాలు చేస్తున్నారు. బీఆర్ఎస్​ను మళ్లీ ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version