ఖమ్మం జిల్లాలో పోలింగ్ బహిష్కరించిన రాయమాదారం ఓటర్లు

-

తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వాతావరణం కాస్త చల్లబడటంతో ఓటేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అధికారులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఇంకా పోలింగ్‌ ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల అరగంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా లేక చీకటి గదుల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. రాత్రి కురిసిన వర్షం, గాలులకు విద్యుత్ నిలిచిపోయిందని అధికారులు అంటున్నారు.

మరోవైపు పలు ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ను బహిష్కరిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్థులు పోలింగ్‌ బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ పోలింగ్ బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా తాము వంతెన కోసం ఆందోళన చేస్తున్నామని అయినా ఎవరూ తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి వచ్చి ఓటర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలంటూ సర్దిచెపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version