నా కొడుకు ఆచూకీ చెప్పాలని కేసీఆర్ అన్న కూతురు వార్నింగ్ ఇచ్చారు. తన కుమారుడు, తెలంగాణ జనరల్ సెక్రటరీ రేగులపాటి రితేష్ రావు ఆచూకీ చెప్పాలని సీఎం కేసీఆర్ అన్న కూతురు రేగులపాటి రమ్యరావు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆమె శనివారం శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ ను బిజెపి కార్యాలయంలో కలిశారు. ప్రివెంటివ్ అరెస్టు చేసిన పోలీసులు రితేష్ రావు ఎక్కడ ఉన్నాడన్న జాడ చెప్పడం లేదని ఆమె ఆరోపించారు.
అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు అర్ధరాత్రి తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్, అంటున్న తెలంగాణ పోలీసులు తన కొడుకును పోలీసులు రక్షిస్తారా.. భక్షిస్తారా? చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ వాళ్ళు ఉద్యమం ముసుగులో ఎన్నో దౌర్జన్యాలు చేశారని, అలాంటి వాళ్ళకు ఇప్పుడు అసెంబ్లీలో రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు సీఎం కేసీఆర్ అన్న కూతురు రేగులపాటి రమ్యరావు.