దేశంలోనే ఉత్తమ విద్యా సంస్థగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ కింద లిస్ట్ విడుదల అయింది. ఈ వివరాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ఢిల్లీలో ప్రకటించారు. ఈ ర్యాంకింగ్స్ ని వివిధ ప్రమాణాల ఆధారంగా ఉన్నత విద్యాసంస్థలను మూల్యాంకనం చేసి.. ర్యాంక్స్ ను వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలోనే ఐఐటీ మద్రాస్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్స్-2024లో టాప్లో నిలిచింది. మరోవైపు ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్ వరుసగా తొమ్మిదో సారి టాప్ గా నినిలిచింది.
రెండో స్థానంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగుళూరు చోటు దక్కించుకుంది. టాప్ 10 జాబితాలో ఎనిమిది ఐఐటీలు, ఎయిమ్స్ ఢిల్లీ, జేఎన్ యూలు ఎంపిక అయ్యాయి. మెడికల్ విభాగంలో ఢిల్లీ ఎయిమ్స్ అగ్రస్థానంలో ఉన్నది. ఈ ఏడాది కాలేజీల విభాగంలో హిందూ కళాశాల టాప్ లో నిలిచింది. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఐఐఎస్సీ బెంగళూరు ఉత్తమ విశ్వవిద్యాలయంగా ఎంపికైంది. ఉత్తమ లా కాలేజీ కేటగిరిలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ విభాగంలో హైదరాబాద్, ఎస్ఐటీ 8 వ స్థానంలో నిలిచింది. ఉత్తమ లా కాలేజీల విభాగంలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్ 3 వ సానంలో నిలిచింది.