రేవంత్‌ సోదరుడు తిరుపతిరెడ్డికి రిలీఫ్‌..హైడ్రాపై హైకోర్టు కీలక తీర్పు !

-

తెలంగాణ సీఎం రేవంత్‌ సోదరుడు తిరుపతిరెడ్డికి రిలీఫ్‌ దక్కింది. హైడ్రాపై తెలంగాణ రాష్ట్ర హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట ఇస్తూ…కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు దుర్గం చెరువు నిర్వాసితులు.

Relief for Revanth brother Tirupati Reddy High Court key verdict on Hydra

అయితే… వారి అబ్జెక్షన్స్పై పై లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు పేర్కొంది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని కూడా వెల్లడించింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుండి ఆరు వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version