అన్నవరం దేవస్థానంలో సరఫరా చేసే నెయ్యిపై కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. దీంతో అన్నవరం దేవస్థానముకు సరఫరా చేసే నెయ్యి ధర విషయంలో ఆరా తీస్తోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏలూరు జిల్లా లక్కవరం లో రైతు డైరీ నుంచి కిలో నెయ్యి 538.60 రూపాయలకు కొనుగోలు చేస్తోంది అన్నవరం దేవస్థానం. అదే నెయ్యి విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానానికి కిలో 385.41 రూపాయలకు రైతు డైరీ ఇవ్వడం జరుగుతోంది.
ధరలలో రెండు చోట్లకి 153 రూపాయలు వ్యత్యాసం ఉందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఒకే క్వాలిటీ ,ఒకే కంపెనీ రెండు దేవాలయాలు లో ఎందుకు అంత తేడాతో టెండర్లు ఇవ్వాల్సి వస్తుందని ఆరా తీస్తోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జరిగిన టెండర్లు పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అన్నవరంలో ఏడాదికి లక్ష కేజీలకు పైగా నెయ్యి కొనుగోలు జరుగుతోందట.