క్వింటా కి రూ.500 ఇచ్చేంత వరకు రేవంత్ సర్కార్ నీ వదిలి పెట్టేది లేదు : కేటీఆర్

-

నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలో, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లోనూ రైతులు ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అకాల వర్షాలనికి చాలా చోట్ల కల్లాల్లో ధాన్యం పూర్తిగా తడిచిందని.. రైతులు ఆదుకునే బాధ్యత సర్కార్ పై ఉండటంతో ఆ ధాన్యాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. అదేవిధంగా క్వింటాకు రూ.500 ఇచ్చే వరకు రేవంత్ సర్కార్ ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

అదేవిధంగా ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఇప్పటికే బీఆర్ఎస్ నాలుగు సార్లు విజయం సాధించని తెలిపారు. ఈసారి గ్రాడ్యుయేట్లు అంతా తమ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత హామీలు గుర్తు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చి. మోసం చేశారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అని వాగ్దానం చేసి ఇప్పుడు దాని గురించే మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ పరీక్ష ఫీజు రూ.200 ఉంటే.. నేడు కాంగ్రెస్ సర్కార్ రూ.2 వేలు చేసిందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version