కొండారెడ్డిపల్లి సాయిరెడ్డి మృతికి రేవంత్ కుటుంబానికి సంబంధం లేదు : గ్రామస్తులు

-

కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే.. రేవంత్‌ రెడ్డి బ్రదర్స్‌ పేరు రాసి.. కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూసైడ్‌ చేసుకున్నాడు. దీనిపై బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో… కొండారెడ్డిపల్లి గ్రామస్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మృతికి రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు గ్రామస్తులు.

పశువుల ఆసుపత్రి కట్టింది ప్రభుత్వ భూమిలో అసలు ఆ పశువుల హాస్పిటల్ కావాలని కొట్లాడిందే సాయిరెడ్డి అని అంటున్నారు. సాయిరెడ్డి ఆత్మహత్యకు సీఎం కు, ఆయన సోదరులకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడిస్తున్నారు. కావాలనే రేవంత్ రెడ్డి కుటుంబాన్ని దీనిలోకి లాగుతున్నారని ఆగ్రహించారు. సీఎం సొంత గ్రామం కాబట్టి కొండారెడ్డిపల్లిని రేవంత్ రెడ్డి అభివృద్ది చేస్తున్నాడని తెలిపారు కొండారెడ్డిపల్లి గ్రామస్తులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version