రేవంత్ సోదరుల వేధింపులు తట్టుకోలేక సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు – కేటీఆర్

-

రేవంత్ సోదరుల వేధింపులు తట్టుకోలేక సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చర్లపల్లి జైల్ వద్దకు చేరుకున్న కేటీఆర్..ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డిని ములాఖాత్ ద్వారా కలిసారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ ద్వారా కలిసారు.

KTR Reacts On Kondareddy saireddy

అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నియంతలా పాలిస్తే నడవదని వార్నింగ్‌ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సోదరుల వేధింపులు తట్టుకోలేక, ఆయన సొంత ఊరులో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజువా? చక్రవర్తివా? నీలాంటి చాలా మంది కొట్టుకుపోయారు, నువ్వు కూడా కొట్టుకుపోతావ్ అంటూ హెచ్చిరించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version