వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు 45, బీఆర్‌ఎస్‌ కు 45 సీట్లు – రేవంత్‌ రెడ్డి

-

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు 45, బీఆర్‌ఎస్‌ కు 45 సీట్లు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్‌ రెడ్డి. తాజాగా రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ సర్వే చేస్తోందని.. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలో brs.. కాంగ్రెస్ సమానంగా ఉందని వివరించారు.

45 సీట్లు కాంగ్రెస్.. 45 brs గెలుస్తుందని స్పస్టం చేశారు రేవంత్‌. అటు బీజేపీ..mim కి చెరో ఏడు సీట్లు వస్తాయన్నారు. బీజేపీ 22 శాతం నుండి 14 కి పడిపోయిందని.. కర్ణాటక ఫలితాల తరువాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని వెల్లడించారు. 15 సీట్లలలో brs.. కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉందని పేర్కొన్నారు. Brs కు 37 శాతం ఓట్ షేర్ ఉందని…కాంగ్రెస్ 35 శాతం ఓట్ షేర్ వచ్చిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version