టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సైని కలిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చినట్టు వెల్లడించారు. రైతులు ఇప్పటికే మిల్లర్లు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకున్నారని… ప్రతీ మిల్లర్ దగ్గర రైతుల వివరాలు ఉన్నాయని.. వారికి బోనస్ గా రూ. 600 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళారులు, మిల్లర్లు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూ. 2600 కోట్ల బియ్యాన్ని మాయం చేశారని ఆరోపించారు.
టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారు: రేవంత్ రెడ్డి
-