తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో కంటెస్టెంట్స్ రోజురోజుకూ తమ గేమ్ ను ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టైటిల్ విన్నింగ్ చాన్సెస్ ఒకరి తర్వాత మరొకరికి పెరుగుతున్నాయి కూడా. అయితే, టాప్ ప్లేస్ లో బిందు మాధవి అలాగే కొనసాగుతుండటం గమనార్హం. ఓటింగ్ లో సత్తా చాటుతు ముందుకు సాగుతున్న బిందు మాధవికే తప్పకుండా విన్నింగ్ చాన్సెస్ ఉంటాయని ఈ సందర్భంగా బీబీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు గేమ్ లో ఉన్న కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ ఒకలాగా ఉండగా, ఏడో వారం నుంచి మరొకలాగా ఉండబోతున్నదని బీబీ లవర్స్ చర్చించుకుంటున్నారు. ఓటింగ్ పర్సంటేజీలో బిందుమాధవికి 45 శాతం దక్కగా, తర్వాత స్థానాల్లో అఖిల్, యాంకర్ శివ, మహేశ్ విట్టా, మిత్రా శర్మ ఉన్నారు. అయితే, డేంజర్ జోన్ లో మాత్రం అరియానా గ్లోరీ, అనిల్ రాథోడ్ ఉన్నారని బీబీ లవర్స్ అంటున్నారు.
సోషల్ మీడియాలోనూ డేంజర్ జోన్ కంటెస్టెంట్స్ గురించి చర్చ జరుగుతున్నది. నటరాజ్ మాస్టర్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారని కొందరు అంటున్నారు. నిజానికి ఓటింగ్ పర్సంటేజీ పరంగా మాత్రం అరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్ డేంజర్ జోన్ లో ఉన్నారు.
ఈ క్రమంలోనే బిందు మాధవికి ఓటింగ్ పర్సంటేజీ రోజురోజుకూ పెరుగుతున్నది. అలా ఆమెకే టైటిల్ విన్నింగ్ చాన్సెస్ మెండుగా కనబడుతున్నాయి. చూడాలి మరి.. ఏం జరుగుతుందో.. అనిల్, మిత్రా శర్మ, మహేశ్ విట్టా సేఫ్ జోన్ లోనే ఉన్నారు.