JDS ఓటమితో..కేసీఆర్ ఓడిపోయినట్టే – రేవంత్‌ రెడ్డి

-

JDS ఓటమితో..కేసీఆర్ ఓడిపోయినట్టేనని చురకలు అంటించారు తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి. కర్ణాటక ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. విద్వేషాలు రెచ్చగొట్టే బిజెపికి కర్ణాటకతో తగిన శాస్తి జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీపై బిజెపి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటాన్ని దేశ ప్రజలు గమనించారన్నారు. తాజాగా కర్ణాటక ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ఈ ఫలితాలు తెలంగాణలో రిపీట్ అవుతాయన్నారు.

ఎర్రకోటపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు. దేశ రాజకీయాల్లో స్పష్టమైన మార్పులు వస్తాయన్నారు. శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలని.. భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారని ఆగ్రహించారు. శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగబలి ఆశీర్వదించాడని.. తెలంగాణలోను స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version