కష్టపడి పని చేసిన వాళ్లకే టికెట్లు ఇస్తాం – రేవంత్‌ రెడ్డి ప్రకటన

-

కష్టపడి పని చేసిన వాళ్లకే టికెట్లు ఇస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటన చేశారు. కాంగ్రెస్ నేతల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ… పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేసినవారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని.. ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజుగారే ఉదాహరణ అన్నారు.

ఈ సమావేశంలో నాలుగు తీర్మానాలు జరిగాయని చెప్పిన రేవంత్‌… ఏఐసీసీ సెక్రెటరీలు బోసురాజు, నదీమ్ జావీద్ లను అభినందిస్తూ తీర్మానం, కొత్తగా నియమితులైన సెక్రెటరీలకు అభినందిస్తూ తీర్మానం, బోయినపల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంఖుస్థాపనకు సోనియాగాంధీని ఆహ్వానించాలని తీర్మానం సీఎల్పీ నాయకుడు భట్టివిక్రమార్క పాదయాత్ర 1000 కి.మీ. పూర్తయిన సందర్భంగా వారిని అభినందిస్తూ తీర్మానం చేసినట్లు వివరించారు.

వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రెటరీలు వారు ఇంఛార్జీలుగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతీ 15రోజులకు ఒక నివేదిక పంపాలని… ఈ ఆరునెలలు కష్టపడి పనిచేయాలని కోరారు. పనీతిరు ఆధారంగానే టికెట్లు వస్తాయి…. సర్వేల ప్రాతిపదికనే టికెట్లు ఇస్తారని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందన్నారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version