ఉపాధ్యాయుల బ‌దిలీలపై రేవంత్‌ సర్కార్‌ కీలక ప్రకటన !

-

ఉపాధ్యాయుల బ‌దిలీలపై రేవంత్‌ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల సంఖ్య‌కు అనుగుణంగా ఉపాధ్యాయుల బ‌దిలీలు ఉంటాయని తెలిపింది. పాఠశాల విద్యా బోధ‌న‌లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పెంచేలా ఉపాధ్యాయ బ‌దిలీల ప్ర‌క్రియ‌కు రూప‌క‌ల్ప‌న‌ చేయనున్నారట. 0-19 వ‌ర‌కు విద్యార్థులున్న పాఠ‌శాల‌కు ఒక‌రు, 20 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠ‌శాల‌కు ఇద్ద‌రు, 61 నుంచి 90 వ‌ర‌కు విద్యార్థులున్న పాఠ‌శాల‌కు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేలా గ‌త ప్ర‌భుత్వం 2015, జూన్‌, 27న జీవో నెం: 17, 2021, ఆగ‌స్టు 21న జీవో నెం: 25 జారీ చేసింది.

Revanth Reddy is checking big leaders to prevent PCC post

విద్యార్థుల సంఖ్య‌, వారికి మెరుగైన విద్యా బోధ‌నను దృష్టిలో ఉంచుకొని తాజాగా ఆయా పాఠ‌శాల‌ల‌కు పోస్టుల‌కు కేటాయింపులు చేస్తారని సమాచారం. 1-10 మంది విద్యార్థులున్న పాఠశాల‌కు ఒక‌టి, 11 నుంచి 40 వ‌ర‌కు విద్యార్థులున్న పాఠ‌శాల‌కు రెండు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠ‌శాల‌కు మూడు, 61పైన విద్యార్థులున్న పాఠశాల‌కు ఆ పాఠ‌శాల‌కు మంజూరైన అన్ని పోస్టులు భ‌ర్తీ చేసేలా వెబ్ ఆప్ష‌న్ల కేటాయింపులు చేస్తారని సమాచారం. ఒక్క విద్యార్థి లేని పాఠశాల‌కు ఉపాధ్యాయుల‌ను కేటాయించ‌లేదని… ప్ర‌స్తుతం ఉన్న విద్యార్థుల‌క‌న్నా ఎక్కువ మంది విద్యార్థులు పాఠ‌శాల‌లో చేరితే పెరిగిన విద్యార్థుల‌కు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపులు ఉంటాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version