కోదండరాం నువ్వు ఏం చేస్తున్నావ్..నిరుద్యోగుల బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. అసెంబ్లీని స్తంభింప చేస్తామని…ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతీలాల్ నాయక్‌తో మాట్లాడాలి, వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చ జరపాలి.. ఇచ్చిన హామీలు అమలు చేయాలి…
ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నిరుద్యోగులు తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.. ఎంతవరకైనా తెగించి కొట్లాడుతుందని వెల్లడించారు. నిరుద్యోగ యువతీ యువకులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుంది… మోతీలాల్ నాయక్ దీక్ష విరమించాలని మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేస్తున్నాను.. కలిసి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని పిలుపునిస్తున్నాను అని వెల్లడించారు.