బీర్లు, బిర్యానీలల గురించి వీడియోలు చేసే మీకు…ఏం తెలుసు బాధలు -RSP

-

బీర్లు, బిర్యానీలల గురించి వీడియోలు చేసే మీకు…ఏం తెలుసు బాధలు అంటూ కొండా సురేఖపై RSP ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో RS ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీకు..విషాహారం తిని తల్లడిల్లుతున్న విద్యార్థుల బాధ అర్థమవుతుందా? అని ప్రశ్నించారు. ఒక మాతృమూర్తిగా ‘కుట్ర’ జరిగిందని మీరు మాట్లాడాల్సిన మాటలేనా? అని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

rs praveen kumar slams konda surekha

కొండా సురేఖ స్థాయి కి నేను దిగజారదల్చుకోలేదని… మీరు భవిష్యత్ లో తెలంగాణ లో మాట్లాడ కండి అంటూ హెచ్చరించారు. మీరు మాట్లాడిన మాటలు వినలేక తెలంగాణ లో మహిళలు తల దించు కుంటున్నారని చురకలు అంటించారు. కోర్టు కూడా కొండా సురేఖ భాష వినలేక పోయిందని… మీకు మంత్రి పదవి లో ఉండే అర్హత లేదని తేల్చి చెప్పారు. నా గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version