ఇవాళ BRS పార్టీలో చేరనున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ ప్రజలకు నమస్కారం… నేను నా రాజకీయ భవితవ్యం పై ఈ రోజు హైదరాబాదులో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.
తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం నేను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నానని పేర్కొన్నారు. నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్దాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా… దయచేసి నిండు మనసుతో ఆశీర్వదించండని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.