ఆర్టీసీ టికెట్ల ధరలు పెంపు..టోల్‌ ఛార్జీలు అంటున్న కండక్టర్‌ !

-

ఆర్టీసీ టికెట్ల ధరలు పెరిగాయని ఓ ప్రయాణికుడు ఆడిగితే..టోల్‌ ఛార్జీలు పెరిగాయని ఓ కండక్టర్‌ సమాధానం ఇచ్చారు. ఈ సంఘటన కోదాడలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇష్టమొచ్చినట్లు చార్జీలు పెంచి.. ప్రయాణికులను దోచుకుంటున్నారని ఆ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశాడు. 12 కిలోమీటర్ల దూరానికి గతంలో రూ.20 ఛార్జ్ ఉంటే ఇప్పుడు రూ.30 చేసిందట ఆర్టీసి. ఎందుకు పెంచారు అని అడిగితే టోల్ పెట్టారు అందుకు పెంచారు అని సమాధానం ఇస్తున్నారట ఆర్టీసీ సిబ్బంది.

rtc charhes issue in kodad

అయితే.. తాజాగా ఓ ప్రయాణికుడు కోదాడకు 12 km దూరంలో ఉన్న చెరువుమదారం క్రాస్ రోడ్ స్టేజీ వరకు టికెట్ అడిగాడట. కానీ కోదాడకు 18 km దూరంలో ఉన్న నేలకొండపల్లి వరకు…బస్సు కండక్టర్ టికెట్ ఇచ్చిందట. బస్ స్టాప్ ఉన్నప్పటికీ అడిగిన స్టేజికి కన్నా రెండు స్టేజీలు ఎక్కువ టికెట్ కొట్టి దానికి టోల్ పేరు చెప్పి ప్రయాణికులను దోచుకుంటున్నారు సదరు ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై సజ్జనార్‌ గారే స్పందించాలని అతను డిమాండ్‌ చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version