మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. మహిళా ప్రయాణికుల కోసం మరో ప్రత్యేక బస్సును #TSRTC ఏర్పాటు చేసిందని… చార్మినార్-గండి మైసమ్మ మార్గంలో ఈ లేడీస్ స్పెషల్ బస్సును నడపాలని సంస్థ నిర్ణయించిందని వివరించారు. 9X/272 నెంబర్ గల ఈ సర్వీస్.. బుధవారం నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
ప్రతి రోజు ఉదయం 8:25 గంటలకు గండిమైసమ్మ నుంచి జీడిమెట్ల, బాలానగర్, ముసాపేట, ఎర్రగడ్డ, అమీర్ పేట, లక్దికాపుల్, గాంధీ భవన్, అఫ్జల్ గంజ్ మీదుగా చార్మినార్ వెళ్తుందని చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. సాయంత్రం 5:20 గంటలకు అదే మార్గంలో చార్మినార్ నుంచి గండి మైసమ్మకు బయలుదేరుతుంది.
ఆ మార్గంలో ప్రయాణించే మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరని కోరారు. అలాగే.. పాక్ మ్యాచ్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే.. ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు సజ్జనార్. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిది. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ను విధిగా ధరించాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఇలా ప్రమాదాలకు గురవుతారు.. జాగ్రత్త! అంటూ హెచ్చరించారు.