10వ తరగతి రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతము 86.60 % – సబితా

-

పదవ తరగతి రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతము 86.60 % వచ్చినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కాసేపటి క్రితమే… తెలంగాణ 10వ తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇక ఈ పదో తరగతి ఫలితాల కోసం.. bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ఈ వెబ్‌ సైట్‌ ను సంప్రదించడి.

తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..అనంతరం మాట్లాడారు. తెలంగాణ టెన్త్‌ ఫలితాలలో 86.60 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ఇందులో బాలికలు 88.53 శాతం, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత.. 25 స్కూళ్లలో సున్నా శాతం ఫలితాలు వచ్చినట్లు తెలియజేశారు. 99 శాతంతో ప్రథమ స్థానంలో నిర్మల్‌ జిల్లా.. 59.46 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్‌ జిల్లా ఉందని ప్రకటన చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి ఫలితాల్లో 86.60% ఉత్తీర్ణత బాలికల ఉత్తీర్ణత – 88.53% బాలుర ఉత్తీర్ణత – 84.68% నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 99% ఉత్తీర్ణత వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా 59.46% ఉత్తీర్ణత

Read more RELATED
Recommended to you

Exit mobile version