నిరుద్యోగులకు మద్దతు తెలిపిన సాయిచంద్ భార్య రజనీ అరెస్ట్..!

-

అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్వీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. “ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనలో కంచలు ఉండవు అన్నారు. ఇప్పుడు ఏమిటి మల్లి కంచలు వేస్తున్నారు. తెలంగాణ ల ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందా ? పోలీస్ రాజ్యం నడుస్తుందా? ఈ టియర్ గ్యాస్ ఏందీ? ఇంతమంది పోలీసులేంది? ఈ నిర్భంధాలేందీ? ఎన్నికల్లో మీరు గొంతులు చించుకుని చెప్పిందేంది, ఇప్పుడు చేసేదేందీ? ఇదెక్కక్కడి మాయదారి మార్పు?” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో విద్యార్థి సంఘాల్ని పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

తాజాగా నిరుద్యోగులకు మద్దతు తెలిపిన తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దివంగత సాయిచంద్ భార్య రజనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నిరుద్యోగులకు మద్దతు ప్రకటించిన BRSV స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే దాసరి ఉషను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే పోలీసులు ప్రైవేట్ పార్ట్స్ ఎట్లా పట్టుకుంటారు ఓ నిరుద్యోగి పోలీసులను నిలదీస్తే.. ఎక్కువ చేస్తే ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా పట్టుకుంటామని పోలీసులు.. విద్యార్థి సంఘాల్ని బెదిరిస్తున్నారు. ఓ నిరుద్యోగి నన్ను వదిలేయండి అంటూ సీఐ కాళ్లు పట్టుకున్న పోలీసులు వదట్లేదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version