ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలు జరుగుతున్నందున.. జాగ్రత్తగా ఉండాలని వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. కాసులకు కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయకండి అంటూ హెచ్చరిక పంపారు సజ్జనార్. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను నమ్మి జీవితాలను నాశనం చేసుకోరాదని తెలిపారు.
ఇలాంటి వాటిపై యువత అప్రమత్తంగా ఉండాలని ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు సజ్జనార్. మీ స్వలాభంకోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసం!? సమాజ క్షేమం పట్టని మీ పెడధోరణులు క్షమించరానివన్నారు. కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయకమైనదని యువత గుర్తించాలన్నారు. స్వార్ధ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి.. చాపకిందనీరులా సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్ మాయలో పడకండి. ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండండని కోరారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేయకండి.
రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని.. మీరు సోషల్ మీడియాలో వదిలే ఇలాంటి వీడియోల వల్ల అమాయకులు ఆన్ లైన్ బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులు అవుతున్నారు.… pic.twitter.com/xfILzcR5Mm
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 30, 2024