భార్య ప్లాన్.. ప్రియుడు అటాక్.. ఈ దెబ్బకు డాక్టర్ సముంత్ రెడ్డి మృతి చెందాడు. యువ వైద్యుడు సుమంత్ రెడ్డి మర్డర్ కేసు వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని సుమంత్ ను హత్య చేసేందుకు ప్రియుడు సామ్యూల్ తో కలిసి సుమంత్ భార్య ఫ్లోరా ప్లాన్ చేసింది. ఈ నెల 20న సుమంత్ రెడ్డిపై సామ్యూల్ దాడి జరిగింది.

సుమంత్ రెడ్డి హత్యకు సహకరించాడు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్. ఎంజీఎంలో చికిత్స పొందుతూ అర్థరాత్రి 12.51 గంటలు సుమంత్ రెడ్డి మృతి చెందాడు. 8 రోజులు మృత్యువుతో పోరాడి ఓడాడు డాక్టర్ సుమంత్. ఇక నేడు ఖాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇక ఈ సంఘటన పై లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.