సొంతూళ్లకు భాగ్యనగరవాసులు.. బస్టాండ్లలో భారీగా రద్దీ

-

సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. ఈ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునేందుకు భాగ్యనగరమంతా సొంతూళ్లకు పయనమవుతోంది. ఇక ఇవాళ్టి నుంచి విద్యాసంస్థలకు కూడా సెలవులు కావడంతో నగరవాసులు ఊళ్లకు బయల్దేరి వెళ్తున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రయాణాలు ప్రారంభించినా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలలో రద్దీ మాత్రం తప్పడం లేదు. ఊరెళ్లేందుకు తరలివస్తున్న జనంతో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి.

ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతి పండుగ సందర్భంగా 4వేల 484 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. 6 వందల 26 సర్వీసులకు  ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి -ఉచిత రవాణా సౌకర్యం అమలు చేయడంతో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌ లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం  షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం,  తాగునీరు,  మొబైల్ టాయిలెట్ల సుదుపాయం కల్పించింది. ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ లలో కొత్తగా 36 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిని బస్‌స్టేషన్‌లోని కంట్రోల్‌ రూమ్‌లకు అనుసంధానం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version