హైదరాబాద్ సరూర్ నగర్ లో పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మతాంతర వివాహం చేసుకున్నాడని చెప్పి నాగరాజు అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ చెల్లిని పెళ్లి చేసుకున్నాడని… ఆమె అన్న, బావలు నడిరోడ్డుపై నాగరాజు తలపై దాడి చేసి హతమార్చారు. ఈ కేసు రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. తాాజాగా ఈ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. కస్టడీ రిపోర్ట్ లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే ఇద్దరే హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు తెలిపారు.
Honor Killing: సరూర్ నగర్ పరువు హత్య కస్టడీ రిపోర్ట్ లో కీలక అంశాలు
-