నా రాజకీయ అనుభవంతో చెప్తున్నా.. షర్మిల సీఎం అవుతారు – డిఎస్

-

డి శ్రీనివాస్ అలియాస్ డిఎస్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దాదాపు అన్ని రాష్ట్రాల నేతలు గుర్తుపట్టి గౌరవించుకునే సీనియర్ నేత. ఒకప్పుడు ఆయన చెప్పిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ దక్కేది. పార్టీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి కి సమాంతరంగా వ్యవహారం నడిపిన చరిత్ర తనది. తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ నేతలు అందరిలో ఆయన సీనియర్. డిఎస్ ప్రస్తుతం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. కాగా ఆయనను సోమవారం వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పరామర్శించారు.

ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది. వైయస్సార్ తో ఉన్న పాత అనుభవాలను గుర్తు చేశారు డీఎస్. అంతేకాదు నా రాజకీయ అనుభవంతో చెప్తున్నాను భవిష్యత్తులో షర్మిల సీఎం కావడం ఖాయమని అన్నారు. వైయస్ కూడా సీఎం అవుతారని 2003లోనే చెప్పానని అన్నారు. వైయస్ బిడ్డ షర్మిల సీఎం అవుతుందని మళ్లీ ఇప్పుడు చెబుతున్నాను అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version