లగచర్ల ఘటనపై SC, ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కోసం గిరిజన భూములు బలవంతంగా లాక్కోవడం కరెక్టు కాదన్నారు. భూమిని నమ్ముకున్న గిరిజన కుటుంబాలు ఏమై పోవాలని… ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదని నిప్పులు చెరిగారు SC, ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. స్వేచ్ఛగా జీవించే హక్కు అంబేద్కర్ కల్పించారని… లగచర్ల గ్రామంలో SC, ST కమిషన్ త్వరలో పర్యటిస్తుందని పేర్కొన్నారు SC, ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.
కమిషన్ SC, STలకు అండగా ఉంటుందని… అన్యాయం జరిగితే కమిషన్ అసలు ఊరుకోదని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా.. లగచర్ల ఘటనలో అరెస్టులు..కొనసాగుతున్నాయి. పోలీసుల అదుపులో మరో పది మంది నిందితులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సహా మొత్తం 21 మంది రిమాండ్ విధించారు. సంగారెడ్డి జైల్లో 20 మంది… చర్లపల్లిలో నరేందర్ రెడ్డి ఉన్నారు. మొదట పరిగి సబ్ జైల్లో 16 మందిని రిమాండ్ చేయగా… మరో నలుగురిని నేరుగా సంగారెడ్డి జైల్లో కి తరలించారు.