తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వండని కోరారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే… కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ లో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంపిణీ చేసారు ఎమ్మెల్యే సీతక్క.
అనంతరం ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం సంతోషాన్ని, బలాన్ని ఇచ్చింది… కర్ణాటక ఫలితాలతో మాకు బాధ్యత కూడా పెరిగిందన్నారు. ప్రజాసంక్షేమ పాలనను కాంగ్రెస్ అందిస్తుందని.. ప్రజలు అవకాశం ఇచ్చారని వెల్లడించారు. ఉన్నత వర్గాలకు, వ్యాపార వర్గాలకు బిజెపి పట్టం కడుతుందని కర్ణాటక ప్రజలు అర్థం చేసుకున్నారు… రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటక ప్రజలకు భరోసాను,విశ్వాసాన్ని కల్పించారని తెలిపారు. కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్పారు ములుగు ఎమ్మెల్యే సీతక్క.