రాబోయే ఎన్నికలలో ప్రజల అనుమతితోనే పోత్తులు ఉంటాయన్నారు జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆంధ్రప్రదేశ్ ని అంధకారంలోకి నెట్టేసిన వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. కరప్షన్ లేని పాలన తేవాలన్నదే జనసేన ఆశయం అన్నారు. అకాల వర్షాల వల్ల నాలుగున్నర లక్షల ఎకరాల్లో రైతాంగం నష్టపోయారని తెలిపారు నాదెండ్ల మనోహర్. గత మూడు ఏళ్ల నుంచి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
రైతాంగాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం గాఢ నిద్రలో ఉందన్నారు. ప్రభుత్వం రైతాంగ సమస్యలను కూడా రాజకీయ కోణంలో చూస్తుందని ఆరోపించారు. కష్టాలలో ఉన్న రైతుల నుంచి ఫోన్ పే బ్యాచ్ వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న కష్టాన్ని నేరుగా వచ్చి చూడాలని సూచించారు. రైతులు కష్టాల్లో ఉన్నా ముఖ్యమంత్రి రాజ నివాసం నుంచి బయటకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్. రైతాంగానికి తక్షణ సహాయం కింద 20వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.